
చాలారోజుల తరువాత ఈ నెల 21న చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో అవును సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో తీసిన అవును సినిమా నిర్మాతలను లాభాల బాటలో నడుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఈ అవును సినిమాకు రవిబాబు దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ హర్రర్ సినిమాకు దాదాపు 45 లక్షల వరకూ ఖర్చయిందట. అయితే ఇప్పటి వరకూ ఈ అవును సినిమా దాదాపు 4 కోట్ల రూపాయిలు వసూలు చేసిందని తెలుస్తుంది. దీంతో దర్శకుడిగానే కాదు, నిర్మాత కూడా సక్సెస్ అవ్వడంతో రవిబాబు హ్యాపీగా ఉన్నాడు.
0 comments:
Post a Comment